
అలక పూనిన 'నాని'
విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక పూనారు.
మచిలీపట్నం : విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక పూనారు. మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హజరవుతున్న వారి జాబితాలో తన పేరు లేకపోవడంపై ఎంపీ కేశినేని నాని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి... అక్కడి నుంచి వెను తిరిగేందుకు ఆయన ఉద్యుక్తుడయ్యారు.
ఇంతలో అక్కడే ఉన్న పార్టీ నేతలు ఆ విషయాన్ని ఆ సమావేశానికి హాజరైన మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ చెవిలో ఊదారు. అంతే ఆయన గబగబ బయటకు వచ్చి... బయటకు వెళ్లిపోతున్న నానిని సముదాయించి... సమావేశానికి రావాలని ఆహ్వానించారు. సమావేశానికి రానని నాని... నారాయణతో తెలిపాడు. నారాయణ తంటాలుపడి నానికి సర్థిచెప్పి సమావేశానికి తీసుకువెళ్లారు.