ఎన్‌ రామ్‌తో సీఎం జగన్‌ మాటామంతి | Sakshi
Sakshi News home page

వర్తమాన రాజకీయాలపై రామ్‌తో సీఎం మాటామంతి

Published Thu, Feb 6 2020 8:38 AM

Hindu Chairman N Ram Meets CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.రామ్‌ తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. బుధవారం విజయవాడలోని గేట్‌ వే హోటల్‌లో జరిగిన ‘ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్‌.రామ్‌ బుధవారం విజయవాడ వచ్చారు. ముందుగా ఆయన తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. అల్పాహార విందు అనంతరం విజయవాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇరువురూ ఒకే కారులో బయలుదేరారు. సాధారణంగా కారు ముందు సీట్లో కూర్చునే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనతో కలిసి మధ్య సీట్లో కూర్చున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తమ మధ్య చర్చకు వచ్చిన కొన్ని అంశాలను సదస్సులో రామ్‌ ప్రస్తావించారు. (చదవండి: రామ్‌ గారూ.. సాయం చేయనా!)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement