సీఎం జగన్‌ను అభినందించిన ఎన్‌ రామ్‌

The Hindu Chairman N Ram Appreciates YS Jagan English Medium Decision - Sakshi

సాక్షి, విజయవాడ : పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రత్మకమైనదని ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. బుధవారం విజయవాడలోని గేట్‌ వే హోటల్‌ల్లో ‘ది హిందూ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌ రామ్‌ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. 

కేవలం ఇంగ్లిష్‌ మీడియంలో చదువు చెప్పడమే కాదు.. మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని అన్నారు. 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల బాధలను తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. సీఎం అయ్యాక వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. (చదవండి: పాలనలో సరికొత్త అధ్యాయం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top