అప్పుల బాధతో ఓ చేనేత కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ధర్మవరం అర్బన్ (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో ఓ చేనేత కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని రామ్‌నగర్‌లో ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. రామ్‌నగర్‌కు చెందిన ఉస్మాన్‌బాషా(48) చేనేత కార్మికుడిగా పని చేస్తున్నాడు. కాగా అతనికి రూ.1.5 లక్షల వరకు అప్పు ఉన్నట్లు సమాచారం.
అయితే శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఉస్మాన్ వీరి ఇంటికి సమీపంలో ఉన్న స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.