విశాఖ జిల్లాలో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చోడవరం మండలం వెంకన్నపాలెం జంక్షన్ వద్ద చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులతో పాటు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.