
తమిళనాడు తరహాలో ఎంసెట్: మంత్రి గంటా
తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
పరిశీలనకు ఓ బృందాన్ని పంపాం : మంత్రి గంటా
సాక్షి, అనంతపురం: తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో సీఎం బాబుతో కలసి ఖాద్రి లక్ష్మీనరసంహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏపీతో పోల్చుకుంటే తమిళనాడులో ఎంసెట్ విధానం బావుందన్నారు. దానిపై అధ్యయనం చేయడానికి రాష్ట్రం నుంచి ఉన్నత శ్రేణి అధికారుల బృందాన్ని పంపినట్లు చెప్పారు.