పర్యావరణానికి ముప్పు
మండలంలోని పలు గ్రామాల్లో పొలం గట్టు కొండలకు నిప్పు పెడుతుండటంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది.
పర్యావరణానికి ముప్పు
మండలంలోని పలు గ్రామాల్లో పొలం గట్టు కొండలకు నిప్పు పెడుతుండటంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది.
గత వారం రోజులుగా అంకాలమ్మ గూడూరు, బలపనూరు, నక్కలపల్లె తదితర గ్రామాల్లో పొలాల గట్లకు గొర్రెల కాపరులు నిప్పంటిస్తున్నారు.
దీంతో గ్రాసం దగ్ధం కావడంతోపాటు మూగ జీవాలు, విష సర్పాలు, కీటకాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాగే కొండ గుట్టకు నిప్పు పెడుతుండటంతో ఆస్తి నష్టం సంభవిస్తోంది. వర్షాకాలంలో గ్రాసం పచ్చగా ఉంటుందన్న భావనతో గొర్రెల కాపరులు ఇలా చేస్తున్నారు. - సింహాద్రిపురం