రైతు రుణమాఫీ అమలులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని...
రుణమాఫీ అమలులో చంద్రబాబు విఫలం: గుర్నాథ్ రెడ్డి
Nov 4 2014 2:05 PM | Updated on Jun 4 2019 5:04 PM
హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు.
భూటకపు హామీలతో రైతులను, మహిళలను దగా చేశారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. టీడీపీ మెనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement