సీసీఐ ఉద్యోగి విషాదాంతం | CCI employee Tragedy | Sakshi
Sakshi News home page

సీసీఐ ఉద్యోగి విషాదాంతం

Dec 31 2013 12:21 AM | Updated on Mar 28 2018 10:59 AM

ఆ కుటుంబం ఆశలు గల్లంతయ్యాయి. భర్త సురక్షితంగా ఉన్నాడని ఆశించిన ఆ ఇల్లాలికి.. తండ్రి క్షేమంగా ఉంటాడని ఆశగా ఎదురుచూసిన పిల్లలకు చివరికి కన్నీళ్లే మిగిలాయి.

తాండూరు, న్యూస్‌లైన్: ఆ కుటుంబం ఆశలు గల్లంతయ్యాయి. భర్త సురక్షితంగా ఉన్నాడని ఆశించిన ఆ ఇల్లాలికి.. తండ్రి క్షేమంగా ఉంటాడని ఆశగా ఎదురుచూసిన పిల్లలకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. గాయాలైనా కనీసం ప్రాణాలతోనైనా తిరిగి వస్తాడనుకున్న ఆ కుటుంబ సభ్యుల ఆశలు అడియాసల య్యాయి. అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాద ఘటన సీసీఐ ఉద్యోగి ప్రతాప్ వినయ్ భార్య, ఇద్దరు పిల్లలకు తీరని వేదనను మిగిల్చింది.
 
 తోటి ఉద్యోగులతోపాటు సీసీఐ అధికార వర్గాల్లో విషాదాన్ని నింపింది. దైవ దర్శనానికి వెళ్లిన సీసీఐ ఉద్యోగి ప్రతాప్ వినయ్ (43) రైలు ప్రమాద ఘటనలో మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో శనివారం తెల్లవారుజామున బెంగళూరు- నాందేడ్ లింక్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనలో గల్లంతైన ప్రతాప్ వినయ్ దుర్మరణం చెందినట్లు బెంగళూరు వెళ్లివచ్చిన సీసీఐ అధికారి ఉపాధ్యాయ సోమవారం నిర్ధారించారు. వినయ్ ప్రతాప్ మృతదేహానికి మంగళవారం పాట్నాలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన చెప్పారు.


 మృతదేహాన్ని ఇలా గుర్తించారు..
 ప్యాంట్ ఇన్నర్ జేబులో ఉన్న బంగారు ఉంగరం, తాండూరులో బట్టలు కుట్టిన  టైలర్‌షాపు పేరు ఆధారంగా ప్రతాప్ వినయ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించినట్టు సీసీఐ ఉద్యోగి చంద్రశేఖర్‌రావు ‘న్యూస్‌లైన్’తో చెప్పారు.
 
 జీర్ణించుకోలేని సీసీఐ వర్గాలు...
 కరన్‌కోట్ నుంచి శనివారం బెంగళూ రు ఆసుపత్రికి వెళ్లిన భార్య శ్వేతాసిం గ్, కూతురు శ్రీమి సింగ్(15), కొడుకు ప్రశాంత్‌జోష్(11)లతోపాటు అక్కడికి చేరుకున్న ఇతర కుటుంబ సభ్యులు... ప్రతాప్‌వినయ్ ఇక లేరనే వార్తతో షాక్ కు గురయ్యారు. వైద్యపరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సుమారు 16ఏళ్లుగా సీ సీఐ ఎలక్ట్రికల్ విభాగంలో  మెకానిక్‌గా  పని చేసిన ప్రతాప్ వినయ్ మృతిని తోటి ఉద్యోగులు, ఇతర అధికారులు, కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఎప్పుడూ అందరితో కలిసిమెలిసి ఉంటూ ప్రేమగా మాట్లాడే వారని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి కర్మాగారం గేట్ ఎదుట ఉద్యోగులు, కార్మికులు కొవ్వొత్తులు వెలిగించి ప్రతాప్‌వినయ్‌కు ఘనంగా నివాళులర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement