ఓ కళాశాలలో బాంబు ఉందని ఓ అంగతకుడు చేసిన ఫోన్ కాల్ స్థానికంగా కలకలం రేపింది.
రేణిగుంటలో బాంబు కలకలం
Sep 23 2014 7:43 PM | Updated on Sep 2 2017 1:51 PM
రేణిగుంట: ఓ కళాశాలలో బాంబు ఉందని ఓ అంగతకుడు చేసిన ఫోన్ కాల్ స్థానికంగా కలకలం రేపింది. రేణిగుంటకు సమీపంలోని కరకబాడీ లోని శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో బాంబు ఉన్నట్టు పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించారు.
దాంతో రేణిగుంట పోలీసులు ఘటనస్థలానికి పరుగులు పెట్టారు. కళాశాలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. చివరికి బెదిరింపు కాల్ అని పోలీసులు నిర్ఱారణ చేసుకున్నారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
Advertisement