బాబు పారిపోయి వచ్చారు: అనంత | Anantha Venkatarami Reddy Satirical Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు రహస్య ఒప్పందాలు చేసుకున్నారు

Nov 28 2019 10:59 AM | Updated on Nov 28 2019 11:23 AM

Anantha Venkatarami Reddy Satirical Comments On Chandrababu - Sakshi

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరు మాసాల పాలన అద్భుతమని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కొనియాడారు. సంక్షేమం అభివృద్ధి సీఎం జగన్‌కు రెండు కళ్లని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుందని, అందుకే అమరావతిపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు.

అమరావతిలో నిజంగా అభివృద్ధి జరిగుంటే నారా లోకేష్‌ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. అమరావతిలో తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టిన చంద్రబాబుకు సింగపూర్‌ వ్యాపారులతో రహస్య ఒప్పందాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నుంచి బాబు పారిపోయి వచ్చారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement