‘అభయ’కు ముందూ దారుణాలు? | Abhaya case culprits rape another woman earlier | Sakshi
Sakshi News home page

‘అభయ’కు ముందూ దారుణాలు?

Nov 8 2013 12:50 AM | Updated on Sep 2 2017 12:23 AM

హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో గత నెలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభయను కిడ్నాప్ చేసి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల దురాగతాలు వెలుగులోకి వస్తున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో గత నెలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభయను కిడ్నాప్ చేసి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల దురాగతాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులైన వరంగల్‌కు చెందిన వెడిచెర్ల సతీష్, అతడి స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లును సైబరాబాద్ పోలీసుల ఇటీవల న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలు వెలుగు చూశా యని సమాచారం. అభయపై అత్యాచారానికి కొన్ని నెలల ముందు మరో నేరం చేసినట్లు నిందితులు బయటపెట్టారు. సతీష్, వెంకటేశ్వర్లు ఓ రోజు వింగర్ వాహనంలో వెళ్తుండగా అర్ధరాత్రి రోడ్లను శుభ్రం చేస్తున్న స్వీపర్‌ను అపహరించి అందులో తిరుగుతూనే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.  అయితే బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడంతో రికార్డుల్లోకి ఎక్కలేదు. ఇప్పుడు ఆమెను గుర్తించడం, సాక్ష్యాధారాలు సేకరించడం కష్టం కావడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement