లారీ-డీసీఎం ఢీ, క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ | 2 Hurt as DCM Van hits Car at Batasingaram | Sakshi
Sakshi News home page

లారీ-డీసీఎం ఢీ, క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌

Jan 23 2014 9:26 AM | Updated on Aug 30 2018 3:56 PM

లారీ-డీసీఎం ఢీ, క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ - Sakshi

లారీ-డీసీఎం ఢీ, క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌

హైదరాబాద్‌ శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనకనుంచి వచ్చిన డీసీఎం వ్యాన్‌ ఢీ కొంది.

హైదరాబాద్ :  హైదరాబాద్‌ శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనకనుంచి వచ్చిన డీసీఎం వ్యాన్‌ ఢీ కొంది. దీంతో... డీసీఎం డ్రైవర్‌, క్లీనర్‌ తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ కాలు క్యాబిన్లో ఇరుక్కుపోయింది. కాలు బయటకు తీయటానికి స్థానికులు తీవ్రంగా శ్రమించారు. కుడికాలు నుజ్జునుజ్జయ్యింది.  డీసీఎం వ్యాన్‌ నల్లగొండ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా హయత్ నగర్ మండలం బాటసింగారం దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement