విధుల నిర్వహణలో అలసత్వం వద్దు
మోటకొండూర్ : విధుల నిర్వహణలో వైద్య సిబ్బంది అలసత్వం వహించవద్దని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం మోటకొండూర్ మండలంలోని మాటూర్ పల్లె దవాఖానా, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. మాటూర్ పల్లె దవాఖానాలో ఎంపీహెచ్‌ఏ విజయరాణి గైర్హాజరైనందున షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడారు. స్టాక్ రికార్డు, సిబ్బంది హజరు రికార్డు ఇలా ప్రతి అంశాన్ని పరిశీలించారు. ఆయన వెంట ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఉన్నారు.
పూర్ణగిరి లక్ష్మీనరసింహస్వామిని
దర్శించుకున్న కలెక్టర్
భువనగిరి: భువనగిరి మండలం నమాత్‌పల్లి గ్రామ పరిధిలో గల శ్రీ సుదర్శన పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామి వారిని కలెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కలెక్టర్‌ను ఆలయ కమిటీ చైర్మన్ రావి సురేందర్‌రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో అలయ అర్చకులు పవన్ శర్మ, ధర్మకర్తలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
ఫ గైర్హాజరైన ఎంపీహెచ్‌ఏకు షోకాజ్ నోటీసు జారీ


