ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి కొత్త పాలకమండలి చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. సోమవారం ప్రమాణస్వీకారం తర్వాత చైర్‌పర్సన్ బీజనబాలమణి, వైస్ చైర్మన్ అంగడి అంజనేయులు, కౌన్సిలర్లు జూకంటి సంపత్,మల్లెల సరిత,వానరాసి మరియమ్మ, పస్తం అంజనేయులు, జెట్ట సిద్దులను ఆయన అభినందించి సన్మానించారు. కాంగ్రెస్ ప్రజాపాలనపై ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ అన్ని వార్డులను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలని పాలకమండలికి ఆయన సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అందరం కలిసి పేదల సంక్షేమానికి పాటుపడాలన్నారు. ఆలేరుతోపాటు జిల్లాలో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన ప్రజలకు ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో పని చేస్తామన్నారు. ఆలేరులో ఒక్కొ వార్డు అభివద్ధికి రూ.కోటి నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రుశోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, నాయకులు నీలం పద్మ, ఇజాజ్, వెంకట్రాజు, సాగర్‌రెడ్డి, ముదిగొండశ్రీకాంత్, ఆలేటి అనిల్, విజయ్‌కుమార్, రాజశేకరగౌడ్, ఆకవరం మోహన్‌రావు, సీపీఐ,సీపీఎం నాయకులు చెక్క వెంకటేష్, ఇక్బాల్ తదితరు పాలకమండలి సభ్యులందరినీ ఘనంగా సన్మానించారు.
ఫోటో16ఏఎల్‌ఆర్611:
ఫ ఒక్కో వార్డుకు రూ.కోటి నిధులు
ఫ పాలకమండలిని సన్మానించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


