ఆధ్యాతిక, పర్యాటక కేంద్రంగా మార్చాలి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాతిక, పర్యాటక కేంద్రంగా మార్చాలి

Jun 12 2026 12:23 AM | Updated on Jun 12 2026 12:23 AM

కొత్తకోట రూరల్‌: పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి శివారులో గల వైరాల గుట్టను ఆధ్మాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఖీమ్యానాయక్‌ అన్నారు. బుధవారం వైరాల గుట్టలో వెలసిన శివాలయాన్ని దర్శించిన ఆయన డీఆర్‌డీఓ ఉమాదేవితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్ట చుట్టూ వేలాది మొక్కలు నాటి ప్రకృతి రమణీయంగా మార్చాలని డీఆర్‌డీఓకు సూచించారు. గుట్టకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేఘారెడ్డి సొంత నిధులతో గుట్ట చుట్టూ రోడ్డు పనులు పూర్తి చేశారని, త్వరలో గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎంపీడీఓ పరిణతి, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, సర్పంచ్‌ మంజుల శ్రీశైలం, ఉప సర్పంచ్‌ రాములమ్మ హన్మంత్‌, గ్రామస్తులు కిరణ్‌కుమార్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, లక్ష్మణ్‌గౌడ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement