ఈ నెల 12న నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా
●
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు..
చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన సంఘాల ఎన్నికలు ఉన్నతాధికారుల నుంచి నోటిఫికేషన్ వెలువడగానే నిర్వహిస్తాం. సంఘాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి సంఘాలకు పంపించాం. యాక్టివ్‌గా ఉన్న చేనేత సహకార సంఘాల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం.
– ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల జిల్లా
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు చేనేత, జౌళిశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల వేడి రాజుకుంది.
● చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 4 నుంచి మే నెల 15 వరకు సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. చేనేత జౌళిశాఖ అధికారులు ఓటరు జాబితా సవరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించారు. ఈ నెల 12న 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడంతో పాటు వారిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ వ్యవహారమంతా అభ్యర్థికి సభ్యులు చేతులెత్తి ఓటేసే ప్రక్రియతో కొనసాగనుందని అధికారులు తెలిపారు. 100 మంది కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలకు ఇదే నెల చివరి వారంలో ఓటింగ్ విధానంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నాగర్‌కర్నూల్ 3 96
జిల్లాల వారీగా సంఘాలు. ఓటర్లు
ఓటర్లు
సంఘాలు
మొదటివిడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకే..
ఓటరు జాబితా సిద్ధం చేసిన అధికారులు
డిఫాల్టర్లు, మృతిచెందిన వారి ఓటుహక్కు తొలగింపు
ఉమ్మడి జిల్లాలో 54 చేనేత సహకార సంఘాలు
నారాయణపేట
10 739
వనపర్తి
8 2,014


