సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలి

Jun 10 2026 12:19 AM | Updated on Jun 10 2026 12:19 AM

వనపర్తి(గోపాల్‌పేట): కేసుల సమాచారాన్ని పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో అప్‌లోడ్‌ చేయాలని అదనపు ఎస్పీ రాజేష్‌మీనా సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కేసుల నమోదు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఎస్‌ఐ శశిధర్‌తో మాట్లాడి కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పోలీసుశాఖలో సీసీటీఎన్‌ఎస్‌ ప్రత్యేకమైన కీలక వ్యవస్థ అని.. కేసుల నమోదు నుంచి దర్యాప్తు, చార్జ్‌షీట్‌ దాఖలు వరకు ప్రతి దశను సాంకేతికంగా పర్యవేక్షించేందుకు వ్యవస్థ పని చేస్తుందని, సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి తప్పిదాలకు తావివ్వకూడదని, పెండెన్సీ లేకుండా చూసుకోవాలని చెప్పారు. డేటా ఎంట్రీలో అత్యుత్తమ పనితీరు కనబర్చి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు. సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకున్నప్పుడే పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement