ప్రతి ఇంటా సోలార్‌ వెలుగులు : మంత్రి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటా సోలార్‌ వెలుగులు : మంత్రి

Jun 10 2026 12:19 AM | Updated on Jun 10 2026 12:19 AM

వనపర్తి(చిన్నంబావి): ప్రతి ఇంటా సోలార్‌ వెలుగులు నింపాలన్న ప్రభుత్వ ఆశయానికి వడివడిగా అడుగులు పడుతున్నాయని.. ఇంటి మిద్దెలపై సొలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. మంగళవారం తన స్వంత గ్రామం మండలంలోని పెద్దదగడలో ఆయన పర్యటించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోలార్‌ ప్రాజెక్టులో పెద్దదగడను పైలెట్‌ గ్రామంగా ఎంపిక చేసిందని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటా సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని.. ప్రభుత్వం రాయితీ అందిస్తుందని వివరించారు. ఆయన వెంట విద్యుత్‌శాఖ అధికారి అప్పలనాయుడు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్‌ యాదవ్‌, బీచుపల్లి యాదవ్‌, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌, సర్పంచ్‌ ఉడుతల భాస్కర్‌, వడ్డెమాన్‌ బిచ్చన్న, బాలు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement