అనాథలుగా మారుతున్న అభాగ్యులు | - | Sakshi
Sakshi News home page

అనాథలుగా మారుతున్న అభాగ్యులు

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

అనాథలుగా మారుతున్న అభాగ్యులు సలహా కేంద్రం...

వ మాసాలు మోసి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలను ఆ తల్లులకు మనసేలా ఒప్పుతుందో తెలియదు కానీ తమ పిల్లలను పెంట కుప్పలు, రోడ్లపై పాడేసి పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో స్థానికులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఐసీడీఎస్‌ సిబ్బంది సహకారంతో శిశుగృహకు చేర్చుతున్నారు. వీరితో పాటు కొందరు తల్లిదండ్రులు తాము సంతనాన్ని పోషించలేమంటూ స్వచ్ఛందంగా శిశుగృహ అధికారులకు అప్పగించి వెళ్తున్నారు. ఇందులో ఎక్కువ మంది బాలికలే ఉండడం గమనార్హం. ఆడపిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకునేందుకు ఆరు నెలల నుంచి ఏడాది, మగ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుంది.

దత్తత సలహా, సహాయ కేంద్రాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. అనాథలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారితో వెళ్లే చిన్నారుల యోగక్షేమాలను ఈ కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. ఎక్కడైనా లోపం తలెత్తితే తదనుగుణంగా చర్యలు సైతం తీసుకుంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement