బాలలకు సంబంధించి పునరావాసం, దత్తత, పునరేకీకరణ, పోషణ వంటి తదితర అంశాలన్నీ జువైనల్ జస్టిస్ యాక్టు 2015 ప్రకారం జరిగి తీరాలి. దత్తత నియమావళి 2017ను కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. దత్తత కావాలనుకునే భార్యాభర్తలిద్దరి అంగీకారం ఎంతో ముఖ్యం. నియమాల ప్రకారం, ప్రమాణాలు అన్ని నెరవేర్చిన తరువాత ఒంటరి లేదా విడాకుల పొందిన వ్యక్తి కూడా దత్తత తీసుకోవచ్చు. ఒంటరిగా నివవించే మగ వ్యక్తి బాలికను దత్తత తీసుకునేందుకు అనర్హుడు.
శిశుగృహ నుంచి దత్తత వెళ్లిన పిల్లలను మా సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఆరునెలలకోసారి పర్యవేక్షిస్తాం. దత్తత తీసుకున్న దంపతులు వారి ఆలనాపాలన సరిగా చూసుకుంటున్నారా.. లేదా.. అనేది తెలుసుకుంటాం. రెండేళ్లలో నాలుగు సార్లు పిల్లలను పర్యవేక్షిస్తాం. పిల్లలను సక్రమంగా చూసుకోకపోతే కారా చట్టం ప్రకారం దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి సమస్య ఎదురుకాలేదు.
– జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి


