ప్రతి గ్రామంలో కనీసం 100 ఇంకుడు గుంతలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో డీఆర్డీఓ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ప్రజాప్రతినిధులతో కలిసి ఇంకుడుగుంతల అవశ్యకతను ప్రజలకు వివరించనున్నారు. అనుకున్న లక్ష్య సాధన కోసం ముందుగా గ్రామ సర్పంచ్ ఇంటి ఆవరణలో మొట్టమొదటగా ఇంకుడుగుంత నిర్మించి కలిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాలని అధికారులు నిర్ణయించారు. లక్ష్యం మేర ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు.


