భూగర్భ జలాల వృద్ధికి.. | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాల వృద్ధికి..

Jun 6 2026 1:11 AM | Updated on Jun 6 2026 1:11 AM

భూగర్భ జలాల వృద్ధికి.. 40 వేల కందకాలు పూర్తి..

భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడుతాయి. ప్రతి కుటుంబం తమ ఇళ్ల ఆవరణలో నిర్మించుకునేలా పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి గ్రామంలో 100 నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యం విధించారు. పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి, క్షేత్ర సహాయకులకు సూచిస్తున్నాం.

– శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత

కొండలు, గుట్టల ప్రాంతంలోని వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకేవిధంగా జిల్లావ్యాప్తంగా 40 వేల కందకాలు పూర్తి చేశాం. దీంతోపాటు ప్రతి ఇంటి ఆవరణలో వ్యక్తిగత ఇంకుడుగుంతతో పాటు ఆలయాలు, బస్టాండ్‌, పాఠశాల ఆవరణలో సామూహిక ఇంకుడు గుంతలను తవ్వించాలని నిర్ణయం తీసుకున్నాం. వీటిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.

– ఉమాదేవీ, డీఆర్డీఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement