అమరచింత: బీడీ ప్యాంకింగ్ రేటు వెయ్యికి రూ.15 పెంచాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మార్‌స్స్ భవనంలో గురువారం ఉమ్మడి జిల్లా ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం నాయకుల సమావేశం నిర్వహించగా.. ఆయన హాజరై మాట్లాడారు. బీడీ కూలి వెయ్యికి రూ.20 పెరిగిందని.. అందుకు అనుగుణంగానే ప్యాకింగ్ రేట్లు పెంచాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో రూ.18 ఉండగా.. ఇక్కడ మాత్రం కేవలం రూ.8.50 మాత్రమే చెల్లించడం దారుణమన్నారు. బీడీ ప్యాకర్స్ వేతనాలు పెంచాలంటూ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నామని.. వారం రోజుల్లో యాజమాన్యం చర్చించకపోతే ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.. కార్యక్రమంలో దేవదానం, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.
బీడీ ప్యాకర్స్ కార్యవర్గం ఏర్పాటు..
బీడీ ప్యాకర్స్ గౌరవ అధ్యక్షుడిగా జేఎన్ దేవదానం, అధ్యక్షుడిగా గోపిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా సుందర్, ప్రధానకార్యదర్శిగా బ్రహ్మం, సహాయ కార్యదర్శిగా రవి, కోశాధికారిగా కురుమూర్తితో పాటు ఏడుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


