సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

Jun 5 2026 1:18 AM | Updated on Jun 5 2026 1:18 AM

కందనూలు: సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మెర పంప్‌హౌస్‌ సందర్శన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు కుమ్మెర కార్యక్రమ ఇన్‌చార్జి ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లోవివిధ జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున 350 మందితో పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో ఉన్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. డ్యూటీ సమయంలో సెల్‌ఫోన్లు చూడటం, ఇతర వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతూ విధులను నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన పాయింట్‌ వద్ద అప్రమత్తంగా ఉంటూ, పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ.. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement