వనపర్తిటౌన్: శ్రీ శ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్తు సంయుక్తంగా రాజమండ్రిలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో శని, ఆదివారం 7వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని.. కవులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రీశ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా. నాయికంటి నరసింహశర్మ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గురువారం సాయంత్రం తెలుగు మహాసభల కరపత్రాలను జిల్లా కవులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహనీయుల స్ఫూర్తివేధిక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్, కవి బైరోజు గిరిరాజాచారి, సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యదర్శి, తపస్ రాష్ట్ర కార్యదర్శి అల్వాల వరప్రసాద్‌గౌడ్, విశ్రాంత తపాలా అధికారి, ఎమ్మార్పీఎస్ జిల్లా అనుబంధ సంఘాల సమన్వయకర్త గంధం గట్టయ్య, తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణ, సామాజిక విశ్లేషకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు రాములు, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త వెంకటస్వామి, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి ఉమామహేశ్వర్, మల్లికార్జున్ పాల్గొన్నారు.


