ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన అందుతుందని సీఎంఓ ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సోళీపురం, ఉప్పరిపల్లి, రుక్కన్నపల్లి, అప్పారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. సోళీపురం గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాంలు ఉచితంగా అందించడమేగాక నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జయశంకర్, ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు సింధు, శేఖర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.


