గతంలో పరిస్థితి మర్చిపోయావా: ఎమ్మెల్యే

TRS MLA Rega Kantha Rao Fires On Forest Officials - Sakshi

అటవీశాఖ అధికారులపై మరోసారి ఆగ్రహం

సాక్షి, ఖమ్మం ‌: పోడుభూముల వ్యవహారంలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ చిఫ్ విఫ్  రేగా కాంతరావుకు అటవీ శాఖ అధికారులకు మధ్య వార్‌ నడుస్తుంది. అధికారుల తీరును తప్పుబడుతూ సోషల్‌ మీడియా వేదికగా ఎమ్మెల్యే ఫైర్‌ అవుతున్నారు. ఆదివాసులని రెచ్చగొట్టొద్దని, మాటలు తగ్గించుకుంటే మంచిదని తక్షణమే కందకాలు తవ్వడం ఆపేయండంటూ పోస్ట్‌ పెట్టారు. ఫారెస్ట్‌ అధికారుల తీరును విమర్శించిన ఆదివాసీలు నేడు గుండాల మండలం, శంభునిగూడెంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారికి బసటగా నిలిచిన ఎమ్మెల్యే..ఆదివాసీ యువకులు గ్రామానికొక్కరు తరలిరండి అని పిలుపునిచ్చారు. 

కొమరం భీంలా గర్జించండి.కదిలిరండి...పోడుపోరులో చేతులు కలపండి అని పేర్కొన్నారు. పోలీసుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరిస్తే పోరు తగ్గదు ఏస్సై గారు..విసిరిన బంతి అదే వేగంతో తిరిగి వస్తుంది మర్చిపోయావా గతంలో పరిస్థితి అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. కాగా కొన్నాళ్లుగా పోడు భూములకు సంబందించి అటవిశాఖ అధికారులకు,ఆదివాసులకు మద్య పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. పోడు భూములలో అటవిశాఖ అధికారులు కందకాలు తోవ్వడాన్ని ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు. ఏన్నో ఏళ్ల నుంచి పోడు భూములలో వ్యవసాయం చేస్తున్నామని ఇప్పుడు కందకాలు తోవ్వితే ఏలా అని అటవిశాఖ అధికారులపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top