Telangana: ఇంటర్‌లో మళ్లీ వంద శాతం సిలబస్‌ | Sakshi
Sakshi News home page

Telangana: ఇంటర్‌లో మళ్లీ వంద శాతం సిలబస్‌

Published Sat, Jun 25 2022 3:09 PM

Telangana: Complete Syllabus Again in Intermediate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచి వందశాతం సిలబస్‌ను అమలు చేస్తామని తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటర్‌ సిలబస్‌ను కుదించారు. 30 శాతం తొలగించి 70 శాతం మాత్రమే బోధిస్తున్నారు. పరీక్షల్లోనూ 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తున్నారు. 

జాతీయ పోటీ పరీక్షల్లో మాత్రం ఈ నిబంధన అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది విద్యా సంస్థలను సకాలంలో తెరవడంతో, సిలబ స్‌ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఇంటర్‌ బోర్డ్‌ కళాశాలలను ఆదేశించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది నుంచి వంద శాతం సిలబస్‌ పూర్తి చేసి, పరీక్షల్లో ప్రశ్నపత్రాలను కూడా ఇదే స్థాయిలో రూపొందిస్తామని స్పష్టం చేసింది. (క్లిక్‌: రాకేశ్‌ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్‌ ఉత్తర్వులు జారీ)

Advertisement
Advertisement