
ప్రతీకాత్మక చిత్రం
బాలానగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇల్లుగుల్ల చేసిన ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ. వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. బాలానగర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్ –1 లో ముక్కు పద్మ దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 11న బీరువాలో 5.5. తులాల బంగారు ఆభరణాలు దాచి పెట్టారు. అయితే.. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి వచ్చి బీరువా తెరచి చూడగా అందులో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.