కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఇక అంబులెన్స్‌ సేవలు ఫ్రీ.. | Hyderabad Police Launches Free Ambulance Service In Hyderabad | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఇక అంబులెన్స్‌ సేవలు ఫ్రీ..

Apr 25 2021 4:01 PM | Updated on Apr 25 2021 4:02 PM

Hyderabad Police Launches Free Ambulance Service In Hyderabad - Sakshi

సాక్షి, గచ్చిబౌలి: సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబరాబాద్‌ పోలీసులు, ఐటీ కంపెనీల సంయుక్తాధ్వర్యంలో శనివారం 12 ఉచిత అంబులెన్స్‌లను సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అంబులెన్స్‌ ఆపరేటర్లు ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణులు, చిన్నారులు, గుండె జబ్బులు ఉన్నవారు, డయాలసిస్‌ పేషెంట్ల కోసం అందుబాటులో అంబులెన్స్‌లు ఉంటాయన్నారు.

సైబరాబాద్‌తో పాటు హైదరాబాద్, రాచకొండ కమిషరేట్‌లలో ఉచితంగా సేవలందిస్తాయని తెలిపారు. రహేజా మైండ్‌ స్పేస్, దివ్యశ్రీ ఓరియన్, ఫినిక్స్, వేవ్‌రాక్, గార్గ్‌ కార్పొరేషన్, అసెండాస్, టీసీఎస్, గుగూల్, డీఎల్‌ఎఫ్‌ సహకారంతో అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌తో పాటు అంబులెన్స్‌ల కోసం 94906 17440, 94906 17431లను సంప్రదించాలన్నారు. 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement