ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై గవర్నర్‌ తమిళి సై సీరియస్‌

Governor Tamilisai Serious On Kaloji Health University Preethi Health - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్‌ మండిపడ్డారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని  వీసీకి లేఖ రాశారు. ప్రీతి మరణం భయంకరమైనదని, సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.

మెడికల్ కాలేజీల్లో యాంటి ర్యాగింగ్‌ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలన్నారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీల్లో కఠిన చర్యలు చేపట్టాలన్నారు. 

మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న గవర్నర్‌.. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, విశ్రాంతి లాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు. మహిళా మెడికోలకు కౌన్సెలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని గవర్నర్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top