సినీ దర్శకుల సంఘం కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం
తమిళసినిమా: సాధారణంగా ఎన్నికలు అంటేనే పోటీలు, ప్రచారాలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరుగుతుంటాయి. త్వరలో జరగనున్న తమిళ్ సినీ నిర్మాతల సంఘం ఎన్నికలు కూడా ఇంచుమించు అలానే జరగనున్నాయి. అలాంటిది తమిళనాడు సినీ దర్శకుల సంఘ నిర్వాహం ఎన్నికలు మాత్రం ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవ ఎంపికతో జరగడం విశేషం. ఈ సంఘం 2026–2029 ఏడాదికి గానూ నూతన నిర్వాహక వర్గం ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఈ నిర్వాహకం పదవి బాధ్యతల కార్యక్రమాన్ని సోమవారం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్‌లో నిర్వహించారు. ఈ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా ఆర్‌కే. సెల్వమణి, ఉపాధ్యక్షులుగా దర్శకుడు పి.వాసు, కేఎస్.రవికుమార్, కార్యదర్శిగా ఆర్‌వీ.ఉదయకుమార్, కోశాధికారిగా దర్శకుడు పేరరసు, ఉప కార్యదర్శులుగా దర్శకుడు ఎస్.ఎళిల్, చరణ్, సుందర్.సీ, ఎన్.ఏకాంబవానన్, ఏకే.తంబిరాజన్ బాధ్యతలను స్వీకరించారు.
అదే విధంగా కార్య నిర్వాహక సభ్యులుగా ఆర్.అరవిందరాజ్, ఎన్.లింగుసామి, మాదేశ్, మరోజ్‌కుమార్, ఏఆర్.మురుగదాస్, సి.రంగనాథన్, ఎస్.రవిమరియా, శరవణ సుబ్బయ్య, ఏ.వెంకటేశ్, వెంకట్ ప్రభు, అశోక్ అన్నామలై, ఇందిరా కిలార, ఆర్‌కే.కన్నన్, ముత్తు వడుకు, డి.రమేశ్ ప్రభాకరన్, సాయిరాంకీ, సుబ్రమణియ భారతి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరి పదవీ బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్.ధాను,టీ.శివ, దర్శకుడు విక్రమన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ధ్రువపత్రాలను ప్రదానం చేసి శుభాకాంక్షలు అందించారు.
సినీ దర్శకుల సంఘం కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం


