విజయవంతంగా ఎస్కలేటర్ సింపోజియం
సాక్షి, చైన్నె : దేశంలో తొలిసారిగా చైన్నెలో తొలి ఎలివేటర్ – ఎస్కలేటర్ సింపోజియం విజయవంతం చేశారు. దేశవ్యాప్తంగా ఏకీకృత అంశాలు, కఠినమైన భద్రతా ప్రమాణాలు అమలు చేయాల్సిన అవసరం గురించి ఇందులో నిపుణులు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సింపోజియంను తమిళనాడు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ వి. రామకృష్ణన్ ప్రారంభించారు. పరిశ్రమలో నాణ్యత, భద్రత, నియంత్రణ సమ్మతి పెంపుదలకు ఇటువంటి సదస్సులు దోహదపడతాయని ఇందులో ప్రముఖులు తెలిపారు. అలాగే జాతీయ పరిశ్రమ క్విజ్‌లో ‘‘మహాగురు’’ బిరుదును స్కచిండ్లర్ ఇండియా ప్రతినిధులు అక్షయ్ మహాదిక్, వైభవ్ బరావ్కర్ దక్కించుకోగా, రన్నరప్ స్థానాన్ని ఫుజెక్ట్ ఇండియా ప్రతినిధులు సొంతం చేసుకున్నారు.


