ఐపీఎల్‌లో కప్‌ సాధిస్తే.. టీమిండియా కెప్టెన్‌ చేయాలా? ఇదెక్కడి రూల్‌! అలా అయితే..

Salman Butt reckons talk of Hardik Pandya as Indias new T20I leader - Sakshi

టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్‌ వినిపిస్తున్నాయి. అదే విధంగా రోహిత్‌ స్ధానంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రపంచకప్‌లో ఓటమి పాలైనంత మాత్రాన కెప్టెన్సీలో మార్పు చేయాలనడం సరికాదు అని అతడు అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్‌లో కప్‌ సాధిస్తే.. కెప్టెన్‌ చేస్తారా?
తన యూట్యూబ్‌ ఛానల్‌లో భట్‌ మాట్లాడుతూ.. "హార్దిక్‌ పాండ్యాను ఎవరు కెప్టెన్‌ చేయాలని అనుకుంటున్నారో నాకు తెలియదు. అయితే అతడు అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఐపీఎల్‌లో కూడా కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. కానీ భారత్‌ వంటి అగ్రశ్రేణి జట్టును సారథిగా ముందుకు నడిపించడం అంత సులభం కాదు.

అలా అయితే రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో ఐదు సార్లు కెప్టెన్‌గా టైటిల్‌ సాధించాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌లో విఫలమయ్యాడు కదా. అదే అతడు ఈ ప్రపంచకప్‌లో ఒకటి రెండు మంచి ఇన్నింగ్స్‌లు ఆడి ఉంటే.. కెప్టెన్సీ మార్పు గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఆసియాలో అది ఒక అనవాయితీ. కెప్టెన్‌గా ఒకట్రెండు సిరీస్‌లలో విఫలమైతే చాలు, కెప్టెన్సీ నుంచి తీసేయాలి, జట్టు నుంచి తొలిగించాలని డిమాండ్స్‌ వినిపిస్తాయి.

ఆట గురించి పూర్తిగా తెలిసినవారు అలా మాట్లడారని నేను అనుకుంటున్నాను. అలా అయితే ఈ ఏడాది ప్రపంచకప్‌ను ఒకే ఒక కెప్టెన్‌ సాధించాడు. మిగిలిన జట్లు ఓడిపోయాయి. ప్రపంచకప్‌లో ఓటమిపాలైనందుకు మొత్తం 11 జట్ల కెప్టెన్‌లను మార్చమంటారా? ఇవన్నీ అవసర​లేని చర్చలు’’ అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: భారత్‌-న్యూజిలాండ్ తొలి టీ20 ఆలస్యం.. కారణమిదే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top