ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఘనత | IPL 2026 DC Vs PBKS, Delhi Capitals Equal CSK And SRH All Time IPL Record With 9 Consecutive Toss Wins | Sakshi
Sakshi News home page

DC Vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఘనత

Apr 25 2026 4:58 PM | Updated on Apr 25 2026 5:22 PM

IPL 2026 DC vs PBKS: Delhi Capitals Equal Stunning IPL Record

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఘనత సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసింది. ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.

ఆరింట మూడు గెలిచి..
వీటిలో మూడు గెలిచిన ఢిల్లీ.. మూడు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం సాధించిన అక్షర్‌ సేన.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌నూ ఓడించింది. అనంతరం గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలోనూ ఓటమి పాలైంది.

ఆ తర్వాత ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ చివరగా సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా సొంతమైదానం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌ను ఢీకొట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ సారథి అక్షర్‌ పటేల్‌ టాస్‌ గెలిచాడు. తద్వారా ఐపీఎల్‌లో వరుసగా తొమ్మిదిసార్లు టాస్‌ గెలిచిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌.. సీఎస్‌కే, సన్‌రైజర్స్‌ రికార్డును సమం చేసింది.

ఐపీఎల్‌లో వరుసగా అత్యధికసార్లు టాస్‌ గెలిచిన జట్లు ఇవే
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 9 సార్లు (2015-16 సీజన్‌)   
చెన్నై సూపర్‌ కింగ్స్‌- 9 సార్లు (2019)
ఢిల్లీ క్యాపిటల్స్‌- 9 సార్లు (2025-26 సీజన్‌)
చెన్నై సూపర్‌ కింగ్స్‌- 8 సార్లు (2018-19)
రాజస్తాన్‌ రాయల్స్‌- 8 సార్లు (2023).

Advertisement
 
Advertisement
Advertisement