Rahul Tripathi: ' సిక్స్‌ కొడతానని ఊహించలేదు'

IPL 2021: I knew we are just one hit away Rahul Tripathi after the match winning six - Sakshi

Rahul Tripathi after the match-winning six: ఐపీఎల్‌ 2021లో భాగంగా బుధవారం జరిగిన  క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో  కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. అయితే చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరగిన ఈ మ్యాచ్‌లో అఖరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన నేపథ్యంలో సిక్స్‌ కొట్టి రాహుల్‌ త్రిపాఠి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన త్రిపాఠి.. ఆ సమయంలో తనపై తనకు జట్టును గెలిపించగలనన్న  నమ్మకం ఉందని  తెలిపాడు.

"జట్టు విజయం చాలా ముఖ్యం. ఒకటి లేదా రెండు కఠినమైన ఓవర్లు మా ఇన్నింగ్స్‌లో ఉన్నాయి. కానీ చివరికి టార్గెట్‌ అంత కష్టంగా మారుతుందని నేను అనుకోలేదు. అఖరికి మేము మ్యాచ్‌ గెలిచినందుకు సంతోషంగా ఉంది.  18 వ ఓవర్ రబాడా చాలా కఠినంగా బౌలింగ్‌ చేశాడు. స్పిన్నర్‌లో ఒకరని టార్గెట్‌ చేయాలని అనుకున్నాను. అదే పని నేను చేశాను. మేము ప్లాన్‌ చేసుకున్నాము. చివరి రెండు బంతులల్లో సాధ్యమైనంత వరకు  పరగులు చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ రెండు బంతులే మిగిలి ఉండడంతో గెలుపు సాధ్యం కాదని అనుకున్నా..  ఆ సమయంలో ఒక పెద్ద హిట్‌ కావాలని భావించా.. అయితే సిక్స్‌తో ముగిస్తానని మాత్రం ఊహించలేదు' అని  త్రిపాఠి పేర్కొన్నాడు. 

కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్‌ ముందు ఉంచింది. అయితే 136 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభమన్‌ గిల్‌, వెంకటేష్ అయ్యర్ 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత కేవలం 7పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కేకేఆర్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. అఖరి ఓవర్‌లో 7 పరుగుల కాల్సిన నేపథ్యంలో మెదటి 4 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు ఆశ్విన్‌ పడగొట్టాడు. ఇక ఢిల్లీ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో.. క్రీజులో ఉన్న రాహుల్‌ త్రిపాఠి ఐదో బంతికి సిక్స్‌ కొట్టి కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చాడు. 

చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా..  పంత్‌ భావోద్వేగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top