జనగణనలో మొదటి స్థానం | - | Sakshi
Sakshi News home page

జనగణనలో మొదటి స్థానం

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: జనగణన–2027 మొదటి దశలో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ గురువారం తెలిపారు. తొలిదశ గృహాల జాబితా, గృహాల లెక్కింపు, మే 11న ప్రారంభమై జూన్‌ 9న ముగిసిందన్నారు. 12 మండలాలతోపాటు రెండు మున్సిపాలిటీల్లో జనగణన నిర్వహించామని తెలిపారు. 1,126 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాకులు, 1,025 మంది ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్‌వైజర్లు పాల్గొని 2 లక్షలకు పైగా జనగణన గృహాలు లెక్కించారని వివరించారు. 2027 ఫిబ్రవరిలో నిర్వహించే జనగణనకు ఇవి ప్రాథమిక ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు. జిల్లా జనగణన హ్యాండ్‌ బుక్‌ తయారీకి అవసరమైన రెవె న్యూ గ్రామాల వారీగా సదుపాయాలకు సంబంధించిన సమాచారం గ్రామస్థాయి అధికారుల ద్వారా జూలైలో సేకరిస్తామన్నారు. జనగణనను ని ర్ధేశిత గడువులో పూర్తి చేయడంలో సహకరించిన చార్జ్‌ అధికారులు, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజ ర్లను అభినందించారు. సీపీవో శ్రీనివాసాచారి, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా పాల్గొన్నారు.

వైద్యులు అందుబాటులో ఉండాలి

వైద్యులు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. సుందరయ్యనగర్‌ అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ముందుగా ఓపీ, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ తనిఖీ చేశారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ టెస్టులపై ఆరా తీశారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ సమయపాలన పాటించాలని, ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు, చికిత్స పొందేలా అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు వివరించాలన్నారు. సబ్‌సెంటర్‌లలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ టెస్టులు చేయాలని కలెక్టర్‌ వైద్యసిబ్బందిని ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement