● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: సీఐ, ఎస్సైలు స్థానిక ఇంటలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, ముందస్తు సమాచారం సేకరణకు ప్రాధాన్యతనివ్వాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో గురువారం వేములవాడ సబ్–డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సమీక్షించారు. పారదర్శకంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే న్యాయ సలహాలు తీసుకోవాలని సూచించారు. నిందితుల అరెస్టులో నిర్లక్ష్యానికి తావివ్వవద్దని స్పష్టం చేశారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీసుశాఖపై విశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. డీఎస్పీలు శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, మధుకర్, మొగిలి, ఎస్సైలు కిరణ్‌కుమార్, వెంకట్రాజం, రమాకాంత్, రమేశ్, రామ్మోహన్, ప్రేమానందం, మోతిరాం తదితరులు పాల్గొన్నారు.


