తెలంగాణ దేశానికి రోల్‌ మోడల్‌ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ దేశానికి రోల్‌ మోడల్‌

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

చందుర్తి(వేములవాడ): కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. చందుర్తి రైతువేదికలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 37 మందికి సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను గురువారం అందజేశారు. అలాగే పలు కమ్యూనిటీ భవనాలకు, ప్రహరీ నిర్మాణాలకు ప్రొసీడింగ్స్‌ అందించారు. విప్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో జాప్యం లేదని, గతంలో జిల్లాలో 2.69 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ఈసారి ఇప్పటికే 3.39 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో 20వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే ప్రభాకర్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి, ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, రుద్రంగి మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, సర్పంచులు కటకం మల్లేశం, చిలుక బాబు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు ఈసరి శ్రీనివాస్‌, ఏనుగు లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement