శిక్షణ భవితకు నిచ్చెన | - | Sakshi
Sakshi News home page

శిక్షణ భవితకు నిచ్చెన

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

15తో ముగియనున్న దోస్త్‌ ప్రవేశాలు

సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రంలో క్రికెట్‌ క్రీడాకా రులకు అందించిన ఉచిత శిక్షణ.. భవిష్యత్‌లో ఉన్నతంగా రాణించేలా దోహద పడు తుందని చైర్‌పర్సన్‌ జిందం కళ అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో గు రువారం శిక్షణ ముగింపులో హాజరై మాట్లాడారు. 120 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, స్థానిక రైజింగ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ క్లబ్‌ ని ర్వాహకులను అభినందించారు. నెలపాటు జరిగిన శిక్షణను క్రీడాకారులు సద్వినియో గం చేసుకున్నారన్నారు. క్రీడాకారులకు సర్టి ఫికెట్లు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు సంగీ తం శ్రీనివాస్‌, కోచ్‌లు వంగ సాయితేజ, దొబ్బల ప్రేమ్‌కుమార్‌, సమ్మర్‌ క్యాంపు ఇన్‌చార్జి వంకాయల కార్తీక్‌ పాల్గొన్నారు.

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో ‘దోస్త్‌’ మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 15తో ముగియనుందని కళాశాల ప్రిన్సిపాల్‌ జయ గురువారం ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల దరఖాస్తుకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 99856 07074, 80083 74874లో సంప్రదించాలని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement