Rabia Sidhu: రబియా సిద్ధూ దూకుడు, పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమేనా?

Rabia Sidhu activities create buzz ahead of 2022 Punjab Assembly elections - Sakshi

చండీగఢ్‌: మాజీ క్రికెటర్, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కుమార్తె రబియా సిద్దూ మరోసారి సంచలనంగా మారింది.  ఇటీవల ఒక మీటింగ్‌లో  తళుక్కున మెరిసిన రబియా తాజాగా చేసిన హడావిడి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పూర్తి పరిణతి చెందిన రాజకీయ నాయకురాలిగా సందడి చేస్తూ తన పొలిటికల్‌ ఎంట్రీపై మరోసారి బజ్ క్రియేట్‌ చేశారు.

పీపీసీసీ పనుల్లో సిద్ధూ బిజీబిజీగా ఉంటే ఆయన కుమార్తె రబియా రాజకీయంగా దూసుకుపోతారనే ఊహాగానాల మధ్య పూర్తి రంగంలోకి దిగిపోయింది. సిద్దూ అసెంబ్లీ నియోజకవర్గం అమృత్‌సర్ ఈస్ట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు,  ఆమె సుడిగాలి పర్యటన స్థానికులను  ఆకట్టుకుంది. అంతేకాదు ఆయా పనుల కొనసాగింపుపై కూడా హామీలను గుప్పించడం విశేషంగా నిలిచింది. వార్తలను గతంలో రుబియా ఖండించినప్పటికీ..ఇటీవల కేవలం పది రోజుల వ్యవధిలోనే వివిధ కార్యక్రమాలతో చూపిస్తున్న రబియా దూకుడు పోలిటిక్స్‌లోకి ఎంట్రీ ఖాయం అనే ఊహాగానాల్ని తెరపైకితెచ్చింది.  ముఖ్యంగా తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్ సర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనుందా అనే అనుమానాలు భారీగా  నెలకొన్నాయి.  

అయితే తాను రాజకీయాల్లో చేరబోతున్నానన్న వార్తలను రబియా ఖండించింది. పంజాబ్‌ సంక్షోభంలో  కూరుకుపోయిన తన తండ్రి తరపున తాను పనిచేస్తున్నట్టు ఇటీవల వెల్లడించారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన రోడ్లు, పార్కులు, అభివృద్ధి పనులను ముఖ్యంగా  రూ .33 లక్షల విలువైన పార్కుల సుందరీకరణ, పనులను  చేపట్టినట్టు తెలిపారు. 

మరోవైపు సిద్ధూకి, పంజాబ్‌  సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి మధ్య  కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇదే ఆఖరి అవకాశం అంటూ  సిద్దూ 13 పాయింట్ల ఎజెండాతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ లేఖ రాశారు. 2017 ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా పంజాబ్‌ ప్రభుత్వాన్ని కదిలించాలంటూ అక్టోబర్‌ 15న రాసిన  నాలుగు పేజల లేఖ ఇపుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

చదవండి : Samantha: అంత పవర్‌ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత

కాగా 2012 లో శిరోమణి అకాలీదళ్-బీజేపీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి సిద్ధు భార్య నవజ్యోత్ కౌర్ అసెంబ్లీ సీటును గెలుచుకోగా,  2009లో కాంగ్రెస్ టికెట్‌పై సిద్ధూ అదే స్థానాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. సోషల్మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రబియా సిద్దూ ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. బాలీవుడ్ నటులకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా  వ్యవహరిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top