Munugode Results: ‘బిడ్డా మీ ఆటలు సాగవింక.. ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఉర్కించి కొడతాం’

Munugode Results Padi Kaushik Reddy Counters Etela Rajender Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడటంతో నాయకుల పరస్పర విమర్శలు రాజకీయ వేడిని తగ్గనీయడం లేదు. తాజాగా టీఆర్‌ఎస్‌ గెలుపును తక్కువ చేసి మాట్లాడతున్న నాయకులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మందికి నీతులు వల్లించే ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది అవుతున్న సొంత నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆయన హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మీడియాతో సోమవారం మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఈ వందల కోట్లు ఎక్కడి నుండి తెచ్చారో చెప్పాలి. చొప్పరి వేణు నీతో ఉంటాడా లేదా? ఈటల హత్య రాజకీయాలు చేసే వ్యక్తి. ప్రవీణ్ యాదవ్‌ను పోలీసుల టార్చర్ తో చంపింది నిజం కాదా? నన్ను కూడా చంపే ప్రయత్నం చేయలేదా? ఇన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తే కానీ గొడవలు.. మీ భార్య సొంత ఊరిలో ఎలా గొడవలు చేశారు. పలివెల గ్రామంలో పల్లా రాజేశ్వర్ రెడ్డినీ చంపే కుట్ర చేశారు’ అని విమర్శలు చేశారు.
(చదవండి: తెలంగాణ సర్కార్‌కి గవర్నర్‌ లేఖ.. అందులో ఏముంది?)

ఇష్టానుసారంగా మాట్లాడితే కబర్ధార్!
‘వివేక్ నీ మొహానికి మళ్ళీ ఎంపీ గా గెలవగలవా? నువ్వు కనీసం వార్డ్ మెంబర్ గా గెలిచే స్థితి లేదు. కేటీఆర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడితే బిడ్డ కబర్దార్‌. కేసిఆర్, కేటీఆర్ పైన ఇక నుండి ఏం మాట్లాడిన ఉర్కించి కొడతాం. బిడ్డ బీజేపీ నాయకుల్లారా ఇక నుండి మీ ఆటలు సాగవు. ఈటల రాజేందర్ నువ్వు గెలిచి ఏడాది దాటింది. హుజూరాబాద్ లో చేసిందేమిటి.

రూ. 3000 పెన్షన్ అన్నవ్ ఇప్పటి వరకు ఇచ్చావా? రోడ్లు, డ్రైనేజ్ లైన అభివృద్ధి చేసినవా?’అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. కాగా, వామపక్షాల భిక్షతో టీఆర్‌ఎస్‌ గెలిచిందని ఈటల రాజేందర్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి టీఆర్‌ఎస్‌ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టారని, అధికార పార్టీకి పోలీసులు కూడా సహాకరించారని ఆరోపించారు.
(చదవండి: బీజేపీ ఓటమిపై ఈటల హాట్‌ కామెంట్స్‌.. వారి భిక్షతోనే టీఆర్‌ఎస్‌ గెలిచింది!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top