Gadapa Gadapaki Mana Prabhutvam: సీఎం జగన్‌ సమీక్ష.. మాజీ మంత్రి కన్నబాబు ఏమన్నారంటే?

Kurasala Kannababu Comments On Gadapa Gadapaki Mana Prabhutvam - Sakshi

సాక్షి, తాడేపల్లి: Gadapa Gadapaki Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సీఎం చెప్పారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలకు వివరించాలని, సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారని కన్నబాబు అన్నారు.

‘‘గృహ సారధుల నియామకం కూడా జరగాలి. దాని వ్యవస్థీకృతం చేయాలని సీఎం చెప్పారు. గడప గడపకు కార్యక్రమంపై నిర్లక్ష్యం వద్దని సీఎం చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తక్కువ రోజులు గడప గడప చేశారు. మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే మార్చిలో వర్క్‌షాప్‌ ఉంటుందని చెప్పారు. ఈలోగా వెనుకబడిన వారి పనితీరు మార్చుకోవాలని సూచించారు.’’ అని కన్నబాబు పేర్కొన్నారు.

చదవండి: మద్యం బ్రాండ్‌లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్‌ కింగ్‌  చంద్రబాబే..!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top