చంద్రబాబుకు ఊహించని దెబ్బ..

Chandrababu Three Days Visit Ended Halfway - Sakshi

టీడీపీ శ్రేణులకు సమాధానం చెప్పలేక తిరుగు ప్రయాణం

అర్ధంతరంగా ముగిసిన మూడు రోజుల పర్యటన

జూనియర్లకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌

మార్మోగిన జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు  

సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం విచ్చేసి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అర్ధంతరంగా పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణమయ్యారు. పార్టీ శ్రేణులు తూటాల్లా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖం చాటేశారని పలువురు కార్యకర్తలు బహిరంగంగా చెప్పుకోవడం కనిపించింది.

పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కార్యకర్తలను కూడగట్టేందుకు ఆయన గురువారం కుప్పానికి విచ్చేశారు. మొదట గుడుపల్లె మండలంలో పర్యటించిన చంద్రబాబుకు ఊహించని దెబ్బ తగిలింది. కార్యకర్తలకు మీరేం చేశారు అంటూ పలువురు పార్టీ నేతలు నిలదీయడంతో షాక్‌కు గురయ్యారు. ఆపై శుక్రవారం కూడా ఇదే అనుభవం ఎదురవడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక మూడు రోజుల పర్యటనను మధ్యలోనే నిలిపేశారు. బాబు పర్యటనలో అడుగడుగునా జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు మార్మోగడం విశేషం.
చదవండి:
కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా!
బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top