బాబు బర్త్‌డే వేడుకల్లో తిరుమల సెట్‌! | Chandrababu Birthday: TDP Leaders Tirumala Set Homas Viral | Sakshi
Sakshi News home page

బాబు బర్త్‌డే వేడుకల్లో తిరుమల సెట్‌!

Apr 20 2026 11:04 AM | Updated on Apr 20 2026 11:17 AM

Chandrababu Birthday: TDP Leaders Tirumala Set Homas Viral

సాక్షి, నెల్లూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడు టీడీపీ శ్రేణులు అతి ప్రదర్శిస్తున్నాయి. వేడుకల పేరుతో రోడ్ల మీదకు చేరి జనజీవనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఆత్మకూరులో స్వయానా దేవాదాయ శాఖ మంత్రి అత్యుత్సాహానికి దిగారు. తిరుమల తరహా సెట్టింగ్‌ వేయించి పూజలు చేయిస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సోమవారం ఉదయం ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అయితే.. ఈ వేడుకలకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ దండోరా వేయించారాయన. ఇక్కడితో ఆగితే ఫర్వాలేదు.. 

ఏకంగా తిరుమల గాలిగోపురం సెట్‌ వేయించారాయన. ఆ సెట్‌ను ఆనుకుని పొలిటికల్‌ బ్యానర్లు వెలిశాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల అర్చకులు, పండితులతో పూజలు, బాబు పేరిట హోమాలు చేయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమై విమర్శలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement