అరే ఏంట్రా ఇది.. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని ఇలా కూడా వాడొచ్చా?

Viral Video: Auto Rickshaw Drives Across Foot Over Bridge on Maharashtra Highway - Sakshi

ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి... రద్దీ రోడ్లను దాటేందుకు ఇబ్బంది పడకుండా పాదచారులకోసం చేసే ప్రత్యేక ఏర్పాటు. కానీ.. మనవాళ్లు ఎలా ఉపయోగించారో చూడండి. అవును.. మీరు చూసింది నిజమే! ఆ బ్రిడ్జి మీదుగా ఆటో వెళ్తోంది. ‘ఇండియాలో ఇంతే!’ అనేలాంటి ఈ ఘటన మహారాష్ట్రలోని ఢిల్లీ–చెన్నైలను కలిపే జాతీయరహదారి 48పై పాల్ఘర్‌ జిల్లాలో జరిగింది. 

ఎస్‌యూవీలకు కూడా సాధ్యం కానీ ఆ ఫీట్‌ ఆటో ఎలా చేసింది? స్టెప్స్‌ ఎలా ఎక్కగలిగిందనే కదా మీ సందేహం. అక్కడ ర్యాంప్‌ సౌకర్యం ఉంది. రోడ్డు దాటాలనుకున్న డ్రైవర్‌ ర్యాంప్‌ ఎక్కించేసి తాపీగా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిపైనుంచి రోడ్డును దాటేశాడు. ట్విట్టర్‌లో వైరల్‌ అవుతున్న ఆ వీడియోను రోడ్స్‌ ఆఫ్‌ ముంబై పోస్టు చేసింది. 

‘బస్‌ యహీ దేఖ్‌నా బాకీ తా’ అంటూ కోట్‌ చేసింది. ‘ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని ఇలా కూడా ఉపయోగిస్తారా?’ అంటూ కొందరు కామెంట్‌ చేస్తే.. ‘అక్కడ మూడునాలుగు కిలోమీటర్ల వరకు క్రాసింగ్‌ లేదు. చిన్న చిన్న వాహనాలు అలాగే దాటేస్తుంటాయి’ అంటూ స్పందించాడు ఓ స్థానికుడు. (క్లిక్: అమాంతం కుప్పకూలిన బ్రిడ్జి.. వందల గ్రామాలకు తెగిన సంబంధాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top