పని చేతకాకుంటే ఇళ్లకు వెళ్లిపోండి.. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు కేంద్రం స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Telecom Minister Ashwini Vaishnaw Warn BSNL Employees Audio Viral - Sakshi

ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్‌ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్‌)కు కేంద్రం స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. 62 వేల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం ఈమధ్యే కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఇకపై బీఎస్‌ఎన్‌ఎల్‌ మెరుగైన ప్రదర్శన కనబర్చాలని.. ఒకవేళ పని చేతకాకుంటే ఇళ్లకు వెళ్లిపోవాలని, లేకుంటే పంపించేయాల్సి ఉంటుందని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఇదేం చిన్నకేటాయింపు కాదు. పునరుద్ధరణ ప్యాకేజీని రూపొందించిన విధానం.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నంత భారీ రిస్క్ ప్రపంచంలో మరే ప్రభుత్వం చేపట్టలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

► ప్రతీ నెలా పనికి సంబంధించి నేనే సమీక్ష నిర్వహిస్తా. పని చేయనివాళ్లు, చేతకానీ వాళ్లు స్వచ్చందంగా విరమణ తీసుకుని ఇళ్లకు వెళ్లిపోండి. లేదంటే.. రైల్వేలో జరిగినట్లుగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందేలా చేస్తాం. 

► BSNL ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే కేంద్ర కేబినెట్‌ భారీ ప్యాకేజీని ప్రకటించింది. మేము చేయవలసింది చేశాం. ఇక ఇప్పుడు చేయాల్సింది మీరే. పని చేయండి లేదంటే వెళ్లిపోండి.

► ఈ పోటీ పరిశ్రమలో మీ పనితీరు మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. నేను రాబోయే 24 నెలల్లో మంచి ఫలితాలను చూడాలనుకుంటున్నా. నేనే మీ పనితీరుపై నెలవారీ నివేదిక చూస్తా అంటూ ఆయన మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడారు. 

గురువారం బీఎస్‌ఎన్‌ఎల్‌ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. ఈ సందర్భంగా అక్కడ జరిగిన భేటీకి సంబంధించిన ఆడియో క్లిప్‌ ఒకటి ఇప్పుడు లీక్‌ అయ్యింది. అయితే ఆ ఐదు నిమిషాల క్లిప్‌ ఒరిజినల్‌దే అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.

అదనంగా.. 
ఇదిలా ఉంటే.. భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (BBNL)ని BSNLతో విలీనం చేసే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ విలీనం ద్వారా, BSNL దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 5.67 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌ను అదనంగా పొందుతుంది. ప్రస్తుతం, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 6.83 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ఉంది.

ఇదీ చదవండి: ఈ ప్యాకేజీలో ఇచ్చిందేమిటి? వచ్చిందేమిటి?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top