షాకింగ్‌ వీడియో: బస్సు సరిగ్గా నడపలేవా.. బైకర్‌ను చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్‌

Karnataka Yelahanka Bus Driver Beats Up Biker Video Viral - Sakshi

రోడ్డుపై వెళ్తున్న క్రమంలో చిన్న తప్పిదాల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ప్రాణాలు సైతం కోల్పోయే అవకాశం ఉంటుంది. తాజాగా ఓ బైకర్‌ కారణంగా పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో బైకర్‌, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తన్నుకునే వరకు వెళ్లింది. ఈ షాకింగ్‌ ఘటన కర్నాటకలో​ చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. యెలహంకా ప్రాంతంలో తన భార్యతో కలిసి సందీప్ (44) అనే వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సందీప్ బైక్ అడ్డుగా వచ్చింది. దీంతో, డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేశాడు. ఈ క్రమంలో ప్రమాదం తప్పింది. అయితే, వెంటనే స్పందించిన సందీప్‌.. బస్సు డ్రైవర్‌ వైపు కోపంగా చూసి సరిగ్గా పోనివ్వాలని చెబుతూ బస్సులోకి ఎక్కి వార్నింగ్‌ ఇవ్వబోయాడు. 

దీంతో వారిద్దరి మధ్య వాదనలు పెరిగి.. తన్నుకునే దగ్గరకు వెళ్లింది. బస్సులో సందీప్‌ను పట్టుకుని డ్రైవర్ చితకబాదాడు. సందీప్‌పై పిడిగుద్దులు కురిపించాడు. కాగా, డ్రైవర్‌ దాడిలో సందీప్‌ తీవ్రంగా గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నేపథ్యంలో బస్సు డ్రైవర్ ను పనిలోంచి తొలగించారు. అతడు ప్రభుత్వ బస్సు నడుపుతున్నప్పటికీ, అతడిని ప్రైవేటు సంస్థ నుంచి తాత్కాలికంగా తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top