కరోనా సోకినా ప్రాణభయం లేదని సర్వేలో వెల్లడి

AIIMS: No deaths Among Those Re Infected With Covid After Vaccination - Sakshi

వ్యాక్సిన్‌ వేసుకుని కరోనా సోకిన వారిపై సర్వే

63 మందిపై అధ్యయనం చేసినట్లు ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నిరోధానికి తీసుకువచ్చిన వ్యాక్సిన్లు సత్ఫలితాలిస్తున్నాయని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) తెలిపింది. వ్యాక్సిన్‌ వేసుకున్నవారు కరోనా వైరస్‌ బారినపడినా ఎవరూ మరణించలేదని పేర్కొంది. ఈ మేరకు తాము చేసిన అధ్యయన నివేదికను శుక్రవారం ఎయిమ్స్‌ విడుదల చేసింది. మొత్తం 63 మందిని ఢిల్లీలో పరీక్షించగా వారు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది.

ఈ సందర్భంగా సర్వే వివరాలను వెల్లడించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా సోకిన 63 మందిపై (ఒకటి, రెండు డోసులు వేసుకున్నవారు) ఢిల్లీలో అధ్యయనం చేశారు. ఏప్రిల్‌- మే నెలలో ఈ అధ్యయనం జరిగింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వైరస్‌ సోకిన వారిని శాంపిళ్లను జీనోమిక్‌ సీక్వెన్స్‌ సంస్థ అధ్యయనం చేసింది. దీనిలో వ్యాక్సిన్‌ వేసుకున్న వారెవరూ కూడా కరోనాతో మరణించలేదని సర్వేలో తేలింది. వ్యాక్సిన్‌ సోకిన తర్వాత కరోనా సోకితే దానిని బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక‌్షన్‌గా పిలుస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో లోడ్‌ అధికంగా ఉందని గుర్తించింది. అయితే దానివల్ల ఎలాంటి ప్రమాదం.. ప్రాణసంకటం ఏమీ జరగలదేని అధ్యయనంలో ఎయిమ్స్‌ తేలింది.

అధ్యయనం ఇలా జరిగింది..

  • మొత్తం 63 బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక‌్షన్‌లు పరిశీలించారు.
  • వీరిలో 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక డోసు వేసుకున్నారు. 53 మంది కోవాగ్జిన్‌, 10 మంది కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు.
  • వీరంతా 5 నుంచి ఏడు రోజుల వరకు అధిక జ్వరంతో బాధపడ్డారు.
  • వారి వయసు 21 నుంచి 92 ఏళ్ల వయసు ఉంటుంది.
  • ఎవరికీ దీర్ఘకాలిక వ్యాధులు లేవు.
  • పది మందిలో పూర్తిస్థాయి ఇమ్యునోగ్లోబిన్‌ జీ యాంటీబాడీలు ఉన్నాయి.
  • ఆరుగురిలో కరోనా సోకకముందే యాంటీబాడీలు వృద్ధి చెందాయి.
  • నలుగురికి ఇన్ఫెక‌్షన్‌ తర్వాత యాంటి బాడీలు వృద్ధి చెందాయి. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top